ప్రీ స్కూల్ నుంచి పాఠశాలకు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:35 AM
మండలంలోని మల్లేవేముల గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 21 మంది చిన్నారులకు ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు.
చాగలమర్రి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లేవేముల గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 21 మంది చిన్నారులకు ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు. చిన్నారుల ఆనందోత్సాహాలతో పాఠశాలలో అడుగుపెట్టగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 21 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన అంగన్‌వాడీ టీచర్ పద్మావతిని అధికారులు అభినందించారు. టీచర్ పద్మావతి చిన్నారులకు సొంత నిధులు రూ.3వేలతో నిర్వహించారు.