అర్జీదారులకు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి
ABN , Publish Date - May 18 , 2026 | 11:39 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, ప్రతి పిటీషన్‌కు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, ప్రతి పిటీషన్‌కు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో అధికారులు మరింత శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పిటిషనర్లకు అందించే ఎండార్స్‌మెంటు స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనూరాధ పాల్గొన్నారు.