Share News

మాన్యం.. మాయం

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:17 AM

మండలంలోని పెద్దకంబలూరు గ్రామం ఆంజనేయస్వామి ఆలయ మాన్యం భూమకి రే సర్వేలో 5 ఎకరాలు తగ్గిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఆలయానికి 181 సర్వే నెంబరులో 1.97 ఎకరాలు, 547లో 4.88 ఎకరాలు, 311లో 14.30, 566లో 1.81 ఎకరాల మాన్యం భూములున్నాయి. కాగా 311 సర్వేనెంబరులో 14.30 ఎకరాలు ఉండాల్సి ఉండగా, రీ సర్వేలో 5 ఎకరాలు తక్కువగా నమోదు చేసినట్లు రైతులు వాపోయారు. కాగా ఈ ఆలయ భూమిని మరో ఆలయ ఖాతాలో ఎలా చేరుస్తారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాన్యం.. మాయం

5 ఎకరాలు తక్కువగా నమోదైన పెద్దకంబలూరు ఆంజనేయస్వామి ఆలయ మాన్యం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

రీ సర్వేలో తక్కువగా చూపిన భూమి ఇదే

రుద్రవరం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దకంబలూరు గ్రామం ఆంజనేయస్వామి ఆలయ మాన్యం భూమకి రే సర్వేలో 5 ఎకరాలు తగ్గిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఆలయానికి 181 సర్వే నెంబరులో 1.97 ఎకరాలు, 547లో 4.88 ఎకరాలు, 311లో 14.30, 566లో 1.81 ఎకరాల మాన్యం భూములున్నాయి. కాగా 311 సర్వేనెంబరులో 14.30 ఎకరాలు ఉండాల్సి ఉండగా, రీ సర్వేలో 5 ఎకరాలు తక్కువగా నమోదు చేసినట్లు రైతులు వాపోయారు. కాగా ఈ ఆలయ భూమిని మరో ఆలయ ఖాతాలో ఎలా చేరుస్తారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే నెంబరుకు రెండు ఎల్పీఎంలు

రీ సర్వేలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆలయ మాన్యాన్ని మరో ఆలయ మాన్యంగా నమోదు చేయడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. మరలా సర్వేచేసి భూములను తేల్చాలని రైతులు డిమాండ్‌ చేస్తునానరు. రెవెన్యూ అధికారులు సర్వేను పర్యవేక్షించి ప్రతి ఖాతాకు ప్రతి సర్వేనెంబరుకు ఓ ఎల్పీయం ఇవ్వాలని, ఒకే సర్వేనెంబరుకు రెండు ఎల్పీఎంలు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

వేలం వాయిదా

311 సర్వేనెంబరులో 14.30 ఎకరాలు ఉండాల్సి ఉండగా, రీసర్వేలో 9.30 ఎకరాలే నమోదు చేశారు. 5 ఎకరాలు తగ్గిపోయినా దేవదాయ అధికారులు పట్టించుకోలేదు. వేలం సమయంలో రైతులు మొత్తం భూమి చూపించాకే వేలం వేయాలని పట్టుబట్టడంతో చేసేదేమీ లేక అధికారులు వేలాలను వాయిదా వేశారు.

తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లాం

ఆంజనేయస్వామి ఆలయ మాన్యాన్ని, రామస్వామి ఆలయ మాన్యంలోకి చేర్చారు. తహసీల్దారు నాగవేణి, సర్వేయరు దృష్టికి తీసుకెళ్లాం. కొలతలు వేయించి సమస్య పరిష్కరిస్తాం. - రామాంజనేయశర్మ, ఈవో

సమస్య ఉన్నతాధికారుల దృష్టికి

ఆలయ భూమి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రీ సర్వేలో మరో ఆలయ భూమిలో మాన్యం చేరిందన్నారు. సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం - వెంకటేశ్‌, వీఆర్వో, పెద్దకంబలూరు

Updated Date - Jun 17 , 2026 | 12:17 AM