Share News

జల వివాదానికి స్విస్తి

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:50 PM

మండలంలోని బాపురం వద్ద ఏర్పడిన జల వివాదానికి స్వస్తి పలికారు. ఆదివారం కర్ణాటక రాష్ట్ర మంత్రి నాగేంద్ర సోదరుడు ప్రసాద్‌, తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడ్‌ బాపురానికి వచ్చి రైతులతో మాట్లాడారు.

జల వివాదానికి స్విస్తి
రైతులతో మాట్లాడుతున్న కర్ణాటక మంత్రి సోదరుడు

ఆందోళన చెందొద్దు.. సాగు నీరందిస్తాం

సరిహద్దు రైతులకు కర్ణాటక మంత్రి సోదరుడి హామీ

హాలహర్వి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బాపురం వద్ద ఏర్పడిన జల వివాదానికి స్వస్తి పలికారు. ఆదివారం కర్ణాటక రాష్ట్ర మంత్రి నాగేంద్ర సోదరుడు ప్రసాద్‌, తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడ్‌ బాపురానికి వచ్చి రైతులతో మాట్లాడారు. ఎల్లెల్సీ కాలువకు ఆంధ్రా వాటా ఇచ్చినా.. ఇవ్వకపోయినా మా వాటాతోనే సరిహద్దు రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సాగునీటి కోసం సరిహద్దు రైతులు వివాదాలు చేసుకోవద్దని, శాంతి యుతంగా ఒకరినొకరు సాగునీటిని వాడుకుని పంటలు పండించుకుందామన్నారు. రు. ప్రస్తుతం కర్ణాటక మంత్రి నాగేంద్ర, ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడుతో తాగు, సాగునీటి విషయంపై చర్చలు జరిపారన్నారు. త్వరలోనే ఆంధ్రా వాటా నీటి విషయంలోనూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కర్ణాటక నీటి వాటాని సైతం సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఆంరఽధా రైతులకు అందిస్తామని, రైతులు ఆం దో ళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇరురాష్ట్రాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:50 PM