Share News

ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలి

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:16 AM

నగరంలోని రహదారులను ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు.

ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలి
రహదారిపై టైర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నగరంలోని రహదారులను ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు. శనివారం బళ్లారి చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారి సర్వీస్‌ రహదారిపై ఉంచిన టైర్లు, శ్వాశ్వత నిర్మాణాలను వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆక్రమణదారులకు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ నగ రంలో వాహనదారులకు ఎదురౌతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు, రహదారులపై జరుగు తున్న ప్రమాదాలను వాణిజ్య దుకాణదారులు గ్రహించి, సామాజిక బాధ్యతగా ఆక్రమణలను పాల్పడకుండా సహకరించాలని సూచించారు. ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు, వాహనదారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు రోడ్లును ఆక్రమించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. విష్ణుటౌనషి్‌పలో మురుగు కాల్వలో తాగునీటి పైప్‌లైన మార్పు పనులు పరిశీలించారు. సెట్కూరు కార్యాలయం వద్ద అన్న క్యాంటీనను తనిఖీచేశారు. ఏఈలు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, జనార్ధన, శానిటరీ ఇనస్పెక్టర్లు, ఎంజల్‌ ప్రణీత, హుస్సేన పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:16 AM