Share News

యువ క్రీడాకారులకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:00 AM

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్‌ అన్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో శనివారం టీజీబీ, లక్కీటూ వెంకటేశ్వర్లు యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీ వెంకటేశ్‌ హాజరయ్యారు.

యువ క్రీడాకారులకు ప్రోత్సాహం
విజేతలతో మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌

కర్నూలు స్పోర్ట్స్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్‌ అన్నారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో శనివారం టీజీబీ, లక్కీటూ వెంకటేశ్వర్లు యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీ వెంకటేశ్‌ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నగరంలో క్రీడల అభివృద్దికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. క్రికెట్‌ పోటీలలో 80 జట్లు పాల్గొనడం విశేషమని అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబీ, లక్కీటూ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి, తన తనయుడు టీజీ భరత్‌ పేరు మీద మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.50 వేలును నిర్వాహకులు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు లక్కీటూ గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 01:00 AM