బాలలతో పని చేయిస్తే శిక్షార్హులు
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:32 AM
బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం బాలలతో పని చేయిస్తే శిక్షార్హులు అవుతారని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, జూన 12(ఆంధ్రజ్యోతి): బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం బాలలతో పని చేయిస్తే శిక్షార్హులు అవుతారని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక న్యాయ సేవాస దన భవనలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాలలతో పని చేయించుకుంటే ఆరు నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. బాల కార్మికులతో పని చేయించుకుంటే వచ్చే అనర్థాల గురించి పారా లీగల్ వలంటీర్లు గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. లేబర్ ఆఫీసర్ కేశన్న మాట్లాడుతూ సమాజంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు తమ శాఖ కృషి చేస్తుం దని అన్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన ఆఫీసర్ శారద మాట్లాడుతూ నగరంలో ఎవరికైనా బాల కార్మికులు కనిపిస్తే టోల్ ఫ్రీ నెంబర్లు 1098కు గానీ, 15100కు గానీ ఫోన చేయాలన్నారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ర్యాలీని లీలా వెంకట శేషాద్రి ప్రారంభించారు. అనం తరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ రాయపాటి శ్రీని వాస్, అధికారులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.