ఉద్యోగులపై వేటు
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:28 PM
శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.
శ్రీశైల దేవస్థానం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ సిబ్బంది
శ్రీశైలం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. టెండరు ప్రక్రియలో అలసత్వం వహించిన కారణంగా సివిల్ విభాగానికి చెందిన రెగ్యులర్ అధికారులు పి చంద్రశేఖర్ శాస్త్రి, యం శివకుమార్, కాంట్రాక్ట్ పద్ధతిపై సివిల్ ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న పి జైపాల్ నాయక్‌లను విధుల నుంచి తొలగిస్తూ ఈవో శ్రీనివాసరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విబూది ధారణ తప్పనిసరి
శ్రీశైలంలో ఆది దంపతులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సహా ఆలయ ప్రవేశం చేసే ప్రతి ఒక్కరూ విబూది, తిలక ధారణ తప్పనిసరి చేశారు. ఆలయ ప్రదాన గోపురం కృష్ణదేవరాయ మహాద్వార ప్రవేశం వద్ద వేదపండితులు శివపంచాక్షరి మంత్రం పఠిస్తూ ఆలయ ప్రవేశం చేసే ప్రతి ఒక్కరికి విబూది పూయడం ఆనందాయకంగా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.