Share News

ఘనంగా తెలుగు భాష, క్రీడా దినోత్సవం

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:26 AM

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామ్మూర్తి జయంంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవ ం నిర్వహించారు.

ఘనంగా తెలుగు భాష, క్రీడా దినోత్సవం
దొర్నిపాడు కస్తూర్బా పాఠశాలలో వేడుకలు

గిడుగు, ధ్యాన్‌చంద్‌కు నివాళులు

బనగానపల్లె, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామ్మూర్తి జయంంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవ ం నిర్వహించారు. అధ్యాపకులు వెంకటరామిరెడ్డి, కిశోర్‌ మాట్లాడుతూ దేశభాషలందు తెలుగులెస్స అని, తెలుగు మధురమైందని, సుసంపన్నమైన సాహిత్య సంపద కలిగిన భాష అన్నారు. తెలుగుభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై ఉందన్నారు. అధ్యాపకులు కృష్ణుడు, కిశోర్‌, రామయ్య, వీరన్న, పద్మావతి, శ్రీలత, రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నందవరం జడ్పీ పాఠశాలలో హెచ్‌ఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడు హుసేనయ్య, కవి పూజారి శ్రీనివాసులు, పీఈటీలు రంగనాయకులను సన్మానించారు. రామచంద్రారెడ్డి, ప్రసాదరెడ్డి, శివశంకర్‌రెడ్డి, అభిలాష్‌, జిలానిబేగం, జయమ్మ పాల్గొన్నారు.

కోవెలకుంట్ల: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు బాష దినోత్సవం శనివారం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ తెలుగు భాషలో సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయని, భాషను మరచిపోతే సంస్కృతిని, సాంప్రదాయాలను మరచినట్లేనని తెలిపారు. తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ నారాయణ, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి, నరేంద్రనాఽథ్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రమణా రెడ్డి, కృష్ణదాస్‌, సంటి రెడ్డి, విద్యార్ధులు పాల్గొన్నారు.

చాగలమర్రి: తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామమూర్తి కృషి మరువలేనిదని హెచ్‌ఎం శివలక్ష్మీ, రాష్ట్ర ఉత్తమ అవార్డుగ్రహిత లక్ష్మయ్య తెలిపారు. శనివారం స్థానిక పీఎంశ్రీ బాలికోన్నత పాఠశాలలో తెలుగుభాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. అజిమ్‌బ్రిలియంట్‌ ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్‌ అన్సర్‌బాషా నిర్వహించారు.

డోన్‌ టౌన్‌: పట్టణంలోని నెహ్రూనగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో తెలుగుబాషా, జాతీయ క్రీడాదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్‌ అధ్యక్షులు భైరెడ్గి గంగిరెడ్డి పాల్గొన్నారు.

ఎన్‌ఎన్‌ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సురే్‌షబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రామకృష్ణారెడ్డి, చంద్రమోహన్‌, పీఈఈ తేజకుమార్‌ను సన్మానించారు. క్లబ్‌ అధ్యక్షులు గంగిరెడ్డి, కార్యదర్శి మల్లారెడ్డి, ఉపాధ్యాయులు మార్తమ్మ, సుభాన్‌భాష, రాంప్రసాద్‌, లక్ష్మీనాయక్‌, రవి నాయక్‌, వెంకటేశ్వరరెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.

పట్టణంలోని శ్రీసుధ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవం కరస్పాండెంట్‌ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్మన్‌ సుదర్శన్‌ గుప్తా, సూర్యనారాయణ, ప్రిన్సిపాల్‌ మేరీ చార్లెస్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ పరిమళ ఉన్నారు.

దొర్నిపాడు: అమ్మిరెడ్డినగర్‌ కస్తూర్బా పాఠశాలలో ప్రన్సిపాల్‌ జయమణి ఆధ్వర్యంలో తెలుగుభాష దినోత్సవం, క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

సంజామల: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవో వెంకటరమణా రెడ్డి, హెచ్‌ఎం షబ్బీర్‌ హుస్సేన్‌ నిర్వహించారు. పీడీ బాషా, తెలుగు ఉపాధ్యాయురాలు వసంతలక్ష్మీని సన్మానించారు. పరమేశ్వర్‌ రెడ్డి, భరత్‌ కుమార్‌రెడ్డి, వెంకట రంగన్న, బాల స్వామి, మనోహర్‌, జయలక్ష్మి పాల్గొన్నారు.

రుద్రవరం: ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు తెలుగు భాష, క్రీడా దినోత్సవం నిర్వహించి, గిడుగు వెంకటరామమూర్తి, ధ్యాన్‌చంద్‌ చిత్రపటాలకు నివాళి అర్పించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు.

బేతంచెర్ల: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీపీ పాఠశాల(మెయిన్‌)లో విద్యార్ధులకు హెచ్‌ఎం పాపారాయుడు శనివారం బహుమతులను పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సూరా మధు సుధాకర్‌ రెడ్డి, ట్రెజరర్‌ మనోహర్‌ రెడ్డి సహకారంతో అందజేశామన్నారు. క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ ఉపేంద్ర, వలిబాషా, రాజేష్‌, బోడరమేష్‌, శ్రీకాంత్‌, వన్నూరు సాహెబ్‌, కమాల్‌బాషా, దానమయ్య, రమణ, బాలమద్దిరాజు, కృష్ణ, శ్రీవాని, లక్ష్మీదేవమ్మ, రోజమ్మ, కామాక్షమ్మ, సునందమ్మ పాల్గొన్నారు.

కొలిమిగుండ్ల: దేశ భాషల్లో తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యముందని మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సంజీవరెడ్డి, తెలుగు పండితుడు గురప్ప పేర్కొన్నారు. అధ్యాపకులు రాముడు, శివశంకర్‌, రాధారాణి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు

Updated Date - Aug 30 , 2026 | 12:26 AM