ఎల్‌నినో దెబ్బకు రైతు విలవిల
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:05 AM
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తగినంత వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. మూడు దశాబ్ధాలుగా ఎన్నడూ లేంతక రువు పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాడుముఖం పట్టిన మొక్కజొన్న, మినుము
మూడు దశాబ్ధాలుగా ఇలా లేదని రైతుల ఆవేదన
చాగలమర్రి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తగినంత వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. మూడు దశాబ్ధాలుగా ఎన్నడూ లేంతక రువు పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాధారణంగా నమోదు కాని ప్రవాహం
సాధారణంగా కుందూ నదిలో 40 నుంచి 60వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండాలి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకపోవడంతో నది ఎండిపోయింది. సెప్టెంబరులో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో 10వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ నీటిని కాస్త కడప జిల్లాకు తరలించడంతో నది ఒట్టిపోయింది.
అధికారులు వద్దన్నా వరి సాగు..
ఈ ఏడాది వరి సాగుచేయొద్దని అధికారులు పలుమార్లు సూచించినా కొందరు రైతులు అలాగే దాదాపు 100 హెక్టార్లలో సాగుచేశారు. ఇటీవల శ్రీశైలం బ్లాక్‌వాట్ వదలడంతో నదికి నీరు వచ్చిందని మళ్లీ వర్షం కురవకపోదా? అని సాగుచేశారు. తీరా పది రోజులు తిరుగక ముందే నీరు నిలిపి వేయడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు.
వరికి బదులు మొక్కజొన్న సాగుచేసినా ఓ మోస్తరు వర్షాలు కూడా లేకపోవడంతో ఆ పంట కూడా ఎండుమఖం పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధారం కింద సాగుచేసిన మినుము, మొక్కజొన్న, కంది తదితర ఆరుతడి పంటలు సైతం బెట్టకు గురై ఎండిపోతున్నాయంటున్నారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ చెప్పారని వారి మాట విని వేస్తే అవి కూడా రావడం లేదని తమను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.