ముంచిన ఎల్‌నినో
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:50 PM
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చెరువుల్లో చుక్కనీరు కనిపించడం లేదు. దీంతో సాగునీటికి మాత్రమే గాక, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 40శాతం మాత్రమే వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భజలాలు అండుగంటుతున్నట్లు సమాచారం.
కొలిమిగుండ్ల మండలంలో ఎండిపోయిన చెరువులు, తగ్గిన సాగు విస్తీర్ణం
కొలిమిగుండ్ల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చెరువుల్లో చుక్కనీరు కనిపించడం లేదు. దీంతో సాగునీటికి మాత్రమే గాక, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 40శాతం మాత్రమే వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భజలాలు అండుగంటుతున్నట్లు సమాచారం.
ఖరీ్‌ఫలో తగ్గిన సాగు విస్తీర్ణం.
ఖరీ్‌ఫలో సాధారణ సాగు విస్తీర్ణం 6వేల ఎకరాలు కాగా, ఈ ఏడాది 340 ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వరి పదెకరాల్లో సాగుచేయగా అవి ఎండిపోయే స్థితికి చేరాయి. అలాగే మినుము, కంది, జొన్న, ఆముదం తదితర పంటలు సాగుచేశారు.
ఫారంపండ్‌లు తవ్వితే మేలు..
మండలంలో ఫారంపండ్‌లు తవ్వాలని రైతులు కోరుతున్నారు. వర్షపు నీటిని నిలబెట్టుకునే అవకాశం లేక పోవడంతో ఆ నీరు ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. అయితే మండలంలో ఎక్కడా ఫారంపండ్‌లు, చెక్‌డ్యాంలు లేకపోవడంతో వర్షపు నీటిని నిల్వచేసే అవకాశం లేదు.
ఇంకుడు గుంతలతో ఉపయోగం
ప్రజలు కూడా నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని, అలాగే వర్షపు నీటిని భూగర్భంలోకి పంపేందుకు వీలుగా ఇంకుడు గుంతలను త్వుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు తమ పొలాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలను పెంపొందించ్చంటున్నారు. అందుబాటులో ఉన్న చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను ధ్వంసం చేయకుండా వర్షాకాలంలో వచ్చే నీటిని వడిసి పట్టడంతో పాటు సరఫరాలో నీర వృథా కాకుండా అరికట్టాల్సినన అవసరం ఉంది. వాల్టా చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, విరివిగా మొక్కలను పెంచితే వర్షాలు కురవడంతోపాటు, నీటి వనరులను కాపాడుకోవచ్చని నిపుణులు, వ్యవసాధికారులు సూచిస్తున్నారు.