Share News

డ్రోన సాయంతో దోమల లార్వా నిర్మూలన

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:31 AM

నగరంలో దోమల వ్యాప్తిని నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

డ్రోన సాయంతో దోమల లార్వా నిర్మూలన
కేసీ కాలువను పరిశీలిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): నగరంలో దోమల వ్యాప్తిని నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు. శుక్రవారం కేసీ కాలువలో డ్రోన సాయంతో బీటీఐ(బాసిల్లస్‌ థురింజియేన్సిస్‌ ఇజ్రాయేలెన్సిస్‌) జీవ లార్విసైడ్‌ను పిచికారిని కమిషనర్‌ ప్రారంభించి మాట్లాడారు. నిల్వ నీటిలో పెరిగే దోమల లార్వాలను ప్రారంభ దశలోనే నిర్మూలిం చడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమ న్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండ చర్యలు తీసుకోవాలని, ఖాళీ పాత్రలు, టైర్లు, కూలర్లు, నీటి ట్యాంకులు తదితర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముందుగా నంద్యాల చెక్‌పోస్టు, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, అరుంధతి నగర్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్న క్యాంటీనను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, డీఈఈ పవనకుమా ర్‌రెడ్డి, శానిటరీ ఇన్సపెక్టర్లు మల్లికా ర్జున, జిలానీ, శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:31 AM