Share News

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:40 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ. సిరి ఆదేశాంచారు.

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
పోలింగ్‌ అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ ఏ. సిరి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ. సిరి

కోడుమూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ. సిరి ఆదేశాంచారు. మండల పరిషత్‌ ఆవరణలో పోలింగ్‌ సిబ్బందికి బుధవారం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలను పోలింగ్‌ అధికా రులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించా లన్నారు. సమయపాలన పాటిస్తూ తమకు కేటాయించిన బాధ్య తలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్వో జయంతి, ఏఆర్వో ఏసీ రాముడు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

గూడూరు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. బుధవారం గూడూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన సెంటర్‌, ఎన్నికల సామగ్రి పంపిణీని ఆమె పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మండలంలో 25 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఎన్నికల విధుల నిర్వహణకు తగిన సిబ్బంది నియమించామన్నారు. పోలింగ్‌ సిబ్బం దికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల వారీగా, పోలింగ్‌ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశా మన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోనే సిబ్బంది రాత్రి బస చేసి మరుసటి రోజు పోలింగ్‌ ప్రక్రియ విధులకు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఆర్డీవో సందీప్‌ కుమార్‌, ఆర్‌వో కర్రెన్న, తహసీ ల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌ ఉన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:40 AM