Share News

ఎన్నికల హామీలను అమలు చేయాలి

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:29 AM

రజకులకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.గురుశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

ఎన్నికల హామీలను అమలు చేయాలి
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న గురుశేఖర్‌

రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురుశేఖర్‌

కర్నూలు న్యూసిటీ, జూన 8(ఆంధ్రజ్యోతి): రజకులకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.గురుశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత బస్తీ కార్యదర్శి జయమ్మ అధ్యక్షతన ధర్నా చేశారు. గురుశేఖర్‌ మాట్లా డుతూ జీవో నెంబర్‌ 27 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో దోబీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విశ్వకర్మ కౌశల్య యోజన పథకం పొందిన లబ్ధిదారులకు పనిముట్లను పంపిణీ చేయాలన్నారు. తెలం గాణ ప్రభుత్వం మాదిరిగానే ఇంటి దగ్గరే ఇస్త్రీ చేసే వారందరికి కేటగిరి వన కింద మీటర్లు అమర్చి 200 యూనిట్లు ఉచిత విద్యుత ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టర్‌ డా.ఏ.సిరిని కలిసి వినతి పత్రం అందజేశారు. కోశాధికారి శ్రీనివాసులు, ఉపాధ్య క్షుడు శేఖర్‌బాబు, రామక్రిష్ణ, ఎల్లయ్య, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 12:29 AM