Share News

ఎన్నికల హామీలు నెరవేర్చాలి

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:41 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

బనగానపల్లె, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. గురువారం బనగానపల్లెలో ఆయన మాట్లాడారు. అన్నదాతలకు రెండు లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం విపలమైందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తొలగించాలన్నారు. గంజాయి, కొకైన్‌ విచ్చలవిడిగా అమ్ముతున్నారని వాటిని నిషేధించాలన్నారు. ఈనెల 30న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరా రు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ, భాస్కర్‌, నాగరాముడు, నాగరాజు, సోమన్న, శివయ్య, నాగాంజనేయులు, శివనాగయ్య, బాలయ్య, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 11:41 PM