ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:13 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నగర నూతన కార్యవర్గంను ఆదివారం ఎన్నుకున్నారు.
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నగర నూతన కార్యవర్గంను ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నగర అధ్యక్షుడిగా కేసీ నాగరాజు, ఉపాధ్యక్షులుగా యశ్వంత్‌కుమార్, జీవన్‌కుమార్, పుల్లయ్య, ఉపాధ్య క్షుడిగా కే.నాగరాజు, కార్యదర్శిగా గోపి, సంయుక్త కార్యదర్శిగా మద్దయ్య, కార్యదర్శిగా ఖాజా బాషా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.