ఎన్నికల నియమావళి పాటించాలి
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:32 PM
ఎన్నికల నియమావళి పాటించాలి
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులకు నిషేదం విధించామన్నారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్టు, సెక్షన్ 163 బీఎన్‌ఎ్‌సఎ్‌స నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయనీ, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. నామినేషన్ కేంద్రాలకు 100 నుంచి 200 మీట ర్ల పరిధిలో జనసమూహాలు, గుమికూడటం, నినాదాలు చేయ డం, ప్రచారాలు నిర్వహించం వంటి చర్యలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరనిఘా, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.