రహదారిపై విద్యుత్ స్తంభాలు
ABN , Publish Date - May 29 , 2026 | 12:17 AM
విద్యు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాహనచోదకులకు ప్రమాదం పొంచి ఉంది. అంకిరెడ్డిపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి తిమ్మనాయినిపేట పవర్ గ్రిడ్ అనుసంధానానికి 11 మీటర్ల ఎత్తు ఉండే విద్యుత్ స్తంభాలను ప్రధాన రహదారిలో ఉంచారు.
కాంట్రాక్టర్ నిర్వాకం.. పట్టించుకోని అధికారులు
కొలిమిగుండ్ల, మే 28 (ఆంధ్రజ్యోతి): విద్యు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాహనచోదకులకు ప్రమాదం పొంచి ఉంది. అంకిరెడ్డిపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి తిమ్మనాయినిపేట పవర్ గ్రిడ్ అనుసంధానానికి 11 మీటర్ల ఎత్తు ఉండే విద్యుత్ స్తంభాలను ప్రధాన రహదారిలో ఉంచారు. అంకిరెడ్డిపల్లె, చింతలాయపల్లె, తిమ్మనాయినిపేట ఆర్‌అండ్‌బీ రహదారికి అడ్డంగా స్తంభాలు ఉన్నాయి. నాటకపోవడంతో వాహనదారులు రాత్రిళ్లు స్థంభాలను ఢీకొట్టి ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులు చర్యలు తీసుకుని స్తంభాలు నాటేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.