పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:36 PM
జిల్లాలో ఆదివారం జరిగే స్థానిక పట్టణ సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ.సిరి శనివారం తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం జరిగే స్థానిక పట్టణ సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ.సిరి శనివారం తెలిపారు. కర్నూలు నగర పాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ పరిధిలో మొత్తం 780 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 884 మంది ప్రిసైడింగ్ అధికారులు, 864 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 3679 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 5,427 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి 192 అత్యంత సమస్యాత్మక, 225 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 304 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు 370 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 1,468 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కలిపి మొత్తం 1838 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.