ఎల్‌నినో దెబ్బతో రబీకి గడ్డుకాలం?
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:19 AM
రబీ సీజన్లో దాదాపు 7వేల హెక్టార్లలో పంటలు సాగుచేసేవారు. కాగా ప్రస్తుతం 3 వేల హెక్టార్లకు మించి సాగవడం లేదు. గత సీజన్లో వరి, మొక్కజొన్న, కొర్ర, మినుము, వేరుశనగ సాగు చేశారు.
ఎండిపోయిన చెరువులు, కాలువలు
గణనీయంగా తగ్గిన పంటల సాగు
చాగలమర్రి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్లో దాదాపు 7వేల హెక్టార్లలో పంటలు సాగుచేసేవారు. కాగా ప్రస్తుతం 3 వేల హెక్టార్లకు మించి సాగవడం లేదు. గత సీజన్లో వరి, మొక్కజొన్న, కొర్ర, మినుము, వేరుశనగ సాగు చేశారు. రాష్ట్రంలోని ఇరత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తున్నా నియోజకవర్గంలో మాత్రం చినుకుజాడ లేదు. వాతావరణ ప్రభావంతో ఉన్న కాస్త భూగర్భజలాలు కూడా అడుగంటాయి. వర్షం కోసం రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆశచావని రైతులు బోర్ల కింద డి.వనిపెంట, ముత్యాలపాడు, చింతలచెరువు, తిప్పనపల్లె గ్రామాల సమీపంలోని చెరువు ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తున్నారు. నీటి లభ్యత లేకపోవంతో ఎక్కువగా మొక్కజొన్నపైనే దృష్టి సారించారు. ఈ రబీలో ఎవరూ వరి సాగు చేయడం లేదు. మండంలోని డి.వనిపెంట సమీపంలో చెరువు వట్టిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో రబీలో పంటలు సాగు చేసేందుకు చొరవ చూపడంలేదు. చెరువులకు కూడా నీరు లేకపోవడంతో వ్యసాయబోర్లలో నీరు అడుగంటిపోయాయి. చిన్న చెరువులు, వక్కిలేరు, కేసీకెనాల్, కుంటల్లో నీరులేదు. ఈ నేపథ్యంలో అధికారులు తెలుగు గంగకు నీరు వదలాలి, వర్షాలు కురిస్తినే గాని గట్టెక్కలేని రైతులు వాపోతున్నారు.
తగ్గిన శనగ సాగు..
రబీ సీజన్‌కు మండలంలో 9వేల ఎకరాల్లో శనగ సాగుచేస్తారు. అయితే కొందరు బోర్ల కింద వెయ్యి ఎకరాల్లో సాగుచేయగా, చాలమంది సాగుచేయలేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితలి లేదని రైతులు వాపోతున్నారు.
రబీలో వరిసాగు లేనట్లే..?
కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువలకు నీరు లేకపోవడంతో ఈ రబీలో వరిసాగు చేసే అవకాశం లేనట్లు సమాచారం. గత రబీలో 3వేల ఎకరాల్లో వరి సాగుచేశారు, కాగా ఈ రబీలో సాగుచేసే అవకాశం లేనట్లు రైతులు అంటున్నారు. ఎన్.తండా, కేపీతండా, ఓజీతండా ముత్యాలపాడు, చిట్టివీడు, గొరిగెనూరు గ్రామాల్లో వ్యవసాయ బోర్లు ఉండేచోట వరినారు సిద్ధం చేశారు. అయితే చెరువుల్లో చుక్కనీరు లేకపోవడం, తెలుగుగంగ అధికారులు నీరు వదులుతారోలేదో తెలియకపోవడంతో వరి సాగుకు రైతులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.