గాజులదిన్నెకు ఎల్‌నినో దెబ్బ
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:27 AM
గాజులదిన్నె ఈ ఏడాది ప్రాజెక్టుకు వరద నీరు ఇప్పటి వరకు చేరలేదు. జీడీపీకి ఎల్‌నినో దెబ్బ బాగానే తాకింది. గతంలో ప్రతి ఏడాది జూలై నాటికి ప్రాజె క్టుకు వరద నీరు వచ్చి చేరేది
అడుగంటుతున్న నీరు
జీడీపీకి ఆధారమైన తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్‌లో అరకొర నీరు
గోనెగండ్ల, జూలై 23(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ఈ ఏడాది ప్రాజెక్టుకు వరద నీరు ఇప్పటి వరకు చేరలేదు. జీడీపీకి ఎల్‌నినో దెబ్బ బాగానే తాకింది. గతంలో ప్రతి ఏడాది జూలై నాటికి ప్రాజె క్టుకు వరద నీరు వచ్చి చేరేది. దీంతో ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడేది. అయితే ఈ ఏడాది వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్టు వెలవెల పోతోంది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్ధ్యం 4.5 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.7 టీఎంసీ నీరు ప్రాజెక్టులో నిలువ ఉన్నట్లు అఽధికారులు తెలుపుతున్నారు. ఎల్‌నినో ప్రభావం గాజులదిన్నె ప్రాజెక్టుపై చూపిందని, వర్షాలు కురవకపోవడ ంతో ప్రాజెక్టుకు నీరు చేర లేదని అధికారులు తెలుపుతున్నారు. సెప్టెంబర్, అక్టోబరులలో కురిసే వర్షాల వల్ల ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరితే చేరవచ్చునని, వచ్చే రబీలో ప్రాజెక్టు కింద ఉన్న 13వేల ఎకరాలకు సాగు అందవచ్చని అన్నారు.
గత ఏడాది ఈ పాటికి వరద నీరు
ప్రస్తుతం జీడీపీలో 1.7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది జాన్ నెల ప్రారంభం అయ్యే సరికి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు కుడి, ఎడవ కాలువల ద్వారా అలువాల, కోడుమూరు తాగునీటికి ఇతర అవసరాలకు దాదాపు 220 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. వర్షాలు కురియక పోవడంతో జీడీపీ చుట్టు పక్కల గ్రామాలకు తాగునీటి సమస్య వస్తే ఉన్న నీరు అంతా అయిపోతే ఎలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
అడుగంటిన తుంగభద్ర, శ్రీశైలం డ్యామ్‌నీరు..
వర్షాలు కురియని సమయంలో కూడా జీడీపీకి జీవనాధరంగా ఉంగే తుంగభద్ర డ్యామ్, శ్రీశైలండ్యామ్ లలో ఈ ఏడాది నీటి మట్టం అడగంటి పోయింది. ప్రతి ఏడాది తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు విడుదల అయిన నీటిని గోనెగండ్ల ఎస్కెప్ చానల్ ద్వార గాజులదిన్నె లోకి మళ్లించి నీటిని నిలువ చేసేవారు. అలాగే హంద్రీనీవా నీటి పథకం ద్వార శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ నీటిని దాదాపు 3 టీఎంసీ నీటిని గాజులదిన్నె ప్రాజెక్టుకు ఇరిగేషన్ అధికారులు మళ్లించే వారు. దీంతో గాజులదిన్నె ప్రాజెక్టుకు వరద ద్వారా నీరు రాకపోయినప్పటికి ఈ రెండు డ్యామ్‌ల ద్వార వచ్చే నీరు సరిపోయేది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు తుంగభద్ర డ్యామ్, శ్రీశైలండ్యామ్ లలో చెప్పుకోతగ్గస్థాయిలో నీట మట్టం లేదు. వర్షాలు కురిసి ఈ రెండు డ్యామ్‌లు నిండకపోతే గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటి కొరత తప్పదు.
తాగునీటి పథకాలకు..
ఈ ఏడాది గాజులదిన్నె ప్రాజెక్టులో ఇప్పటికి 1.7 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు కింద తాగునీటి పఽథకాలు బండగట్టు, డోన్, క్రిష్టగిరి ఉన్నాయి. ఈ పథకాలకు ప్రతి రోజు జీడీపీ నుంచే నీరు విడుదల అవుతుంది. ఈ మూడు పథకాలకు రోజుకు 10 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంటుంది.
సాగు నీటి వివరాలు
ప్రాజెక్టు కింద ఆయకట్టుదారులు గత ఏడాది రబీ సీజన్‌లో 13వేల ఎకరాల్లోపు పంటలు సాగుచేసుకున్నారు. వారికి ఈ ఏడాది ఏఫ్రిల్ నెల 15 వరకు నీటి విడుదల చేశారు. వచ్చే రబీకి పంటలకు సాగుకు అవసరమైన నీరు వస్తుందా లేదా అని రైతులు వర్షంకోసం ఎదురుచూస్తున్నారు. ఎండవేడిమికి భూమిలోకి నీరు ఇంకిపోవడం, ఆవిరి రూపంలో కొంత నీరు వృధా కావటం, చూట్టుపక్కల రైతులు పైపులు మోటర్లతో నీటిని వినియోగించుకోవడతో ఇప్పటి నుంచి రోజకు 30 క్యూసెక్కుల నీరు వృఽథా అవుతోంది. వేడిమి పెరిగే కొద్దీ నీటి ఆవిరి పెరిగే అవకాశం ఉంది.