శ్రీశైలం టౌన్‌షిప్ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:17 PM
శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం కలిసి ఉన్న శ్రీశైలం మహాక్షేత్రాన్ని అభి వృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం టౌన్‌షిప్‌నకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
4వేల హెక్టార్ల కోసం అటవీశాఖతో సంప్రదింపులు
దోర్నాల నుంచి త్వరలో ఎలివేటెడ్ కారిడార్
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
శ్రీశైలం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రం కలిసి ఉన్న శ్రీశైలం మహాక్షేత్రాన్ని అభి వృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం టౌన్‌షిప్‌నకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం పర్యటనకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ఉదయం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంటలోని స్టాఫ్ క్వార్టర్స్ నూతన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం టౌన్‌షిప్ అభివృద్ధి చేసేందుకు 4 వేల హెక్టార్ల స్థలం అవసరం అవుతుందని కేంద్ర అటవీ శాఖను కోరామన్నారు. కనీసం అందులో సగం రెండు వేల హెక్టార్ల స్థలాన్ని కేటాయించినా మాస్టర్ ప్లాన్ అమలుకు సులభతరమవుతుందని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించినట్లు తెలిపారు. నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన తర్వాత క్షేత్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అదేవిధంగా దేవస్థానం సిబ్బంది కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవన సముదాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. దేవస్థానం పరిపాలనా విభాగంలో విధుల నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కోసం రూ.60 కోట్లతో నిర్మించిన 297 అత్యాధునిక హంగులతో భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరో రూ.10 కోట్లతో అంతర్గత రహదారులను కూడా వేయిస్తామన్నారు. ఆత్మకూ రు-దో ర్నాల-మన్న నూరు- దోమలపెంట మీదుగా శ్రీశైల క్షేత్రానికి చేరుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం ఇరుకుగా ఉందన్నారు. రోజురోజుకు పెరిగి పోతు న్న భక్తుల రద్దీకి అధ్యయనం చేసిన కేంద్ర ప్రభు త్వం జాతీయ రహదారుల సంస్థకు ఎలివేటెడ్ కారిడార్ ఏర్పా టు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. త్వర లోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మం త్రి వెంట ఆలయ ఈఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.