తాగునీటి సరఫరా మెరుగునకు కృషి
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:27 AM
నగర ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నగర పాలక యంత్రాంగం కృషి చేస్తోందని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): నగర ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నగర పాలక యంత్రాంగం కృషి చేస్తోందని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శుక్రవా రం ఆయన నిర్మల్‌నగర్, గురురాఘవేంద్ర నగర; ఉమా మహేశ్వర్‌నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాలో ఎదురవు తున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాగునీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న సిబ్బందిని ప్రజ లు గుర్తుపట్టేలా ప్రత్యేకంగా డ్రస్ కోడ్ అమలు చేయాలని, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు నిర్ణయించిన యూనిఫామ్‌లోనే విధులు నిర్వహించాలని ఆదేశిం చారు. ఎంఈలు మ నోహర్‌రెడ్డి, గిరిరాజ్, డీఈఈలు క్రిష్ణలత, నరేష్, ఏఈలు ప్రవీణ్‌కు మార్‌రెడ్డి, షేక్షావలి, ఖాసిం వలి ఉన్నారు.