Share News

జాతీయ జల అవార్డుల సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:30 PM

జిల్లాలో నీటి సంరక్షణ, జల వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణకు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా వివరించి 7వ జాతీయ జల అవార్డులు సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

జాతీయ జల అవార్డుల సాధనకు కృషి చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి సంరక్షణ, జల వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణకు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా వివరించి 7వ జాతీయ జల అవార్డులు సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం 7వ జాతీయ జల అవార్డుల సాధనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సిన ప్రతిపాదనలు, జిల్లాలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నుంచి వచ్చే బృందం జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ, జల వనరుల అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సమగ్ర నివేదికలు, ఆధారాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నెల 17, 18వ తేదీల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే రెండో రోజు నంద్యాల పట్టణంలోని మురుగునీటి శుద్ధి కేంద్రం, పాణ్యం, బేతంచెర్ల, డోన్‌ మండలాల్లో పరిశీలించనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు వచ్చేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 11:30 PM