వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలి
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:45 PM
వృద్ధ్దాశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయుల, వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వృద్ధ్దాశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయుల, వృద్ధుల సంక్షేమానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు. గురువారం నగరంలోని స్థానిక మద్దూరునగర్‌లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహం, అమ్మ వృద్ధ్దుల శరణాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, నిరాశ్రయులు సమాజంలో భాగమని, వారి హక్కులను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. వారికి ఏవైనా సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రాంపుల్లయ్య, వసతి గృహాల నిర్వాహకురాలు శకుంతల తదితరులు పాల్గొన్నారు.