Share News

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:56 PM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకుని నేరాల నియంత్రణకు కృషిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

శాంతి భద్రతలను పరిరక్షించాలి

రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌

ఘనంగా ముగిసిన కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

కర్నూలు క్రైం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకుని నేరాల నియంత్రణకు కృషిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శనివారం స్థానిక ఏపీఎస్‌పీ బెటాలియన్‌ పరేడ్‌ మైదానంలో 2025-26 బ్యాచ్‌కు చెందిన 629 మంది ఏపీఎస్‌పీ ట్రైనీ కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణా అనంతరం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా ముగిసింది. ఈకార్యక్రమానికి మంత్రి టీజీ భరత్‌ హాజరై పోలీ సుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్‌ కమాండర్‌ ఆధ్వర్యంలో శిక్షణార్థులు ప్రదర్శించిన లయబద్దకమైన కవాత్‌, మార్చ్‌ఫాస్ట్‌ ఆకట్టుకున్నాయి. శిక్షణ కాలంలో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన ట్రైనీ పోలీసులకు మంత్రి టీజీ భరత్‌ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ శిక్షణ తర్వాత కానిస్టేబుళ్లు పరేడ్‌ చాలా బాగా చేశారన్నారు. శిక్షణను పకడ్బందీగా పర్యవేక్షించిన శిక్షకుల కృషిని ఆయన అభినం దించారు. పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా కానిస్టేబుళ్లు సేవా దృ క్పథంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నారు. నేర పరిశోధన, నిందితుల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఏపీఎస్‌పీ బెటాలియన్‌ కమాండ్‌ దీపికా పాటిల్‌ మాట్లాడుతూ కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో 430 మంది, కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 199 మంది కలిపి మొత్తం 626 ఏపీఎస్‌పీ ట్రైనీ కానిస్టేబుళ్లకు 9 నెలల కాలం శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అవార్డులు పొందిన వారి వివరాలు వివరించారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, కలెక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, అడిషినల్‌ ఎస్పీ హుసేన్‌పీరా, అడిషినల్‌ కమాండెంట్‌ నాగేంద్రరరావు, అసిస్టెంట్‌ మాండెంట్లు డి.వెంకటరమణ, ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణ మోహన్‌, డీటీసీ వైస్‌ ప్రిన్సిపల్‌ జి.దుర్గ ప్రసాద్‌, డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీసు అధికారులు శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో టాపర్లు

బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌, బెస్ట్‌ ఇండోర్‌గా - నందికం శ్రీనివాసులు

బెస్ట్‌ అవుట్‌డోర్‌ - ముప్పురి ప్రశాంత్‌

బెస్ట్‌ ఫైరర్‌ - పరస తరుణ్‌ కుమార్‌

పరేడ్‌ కమాండర్‌ - అంకే నంద కుమార్‌

డీటీసీ శిక్షణలో టాపర్లు

బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌, బెస్ట్‌ ఇండోర్‌ - చప్పటి రోహిత్‌

బెస్ట్‌ అవుట్‌డోర్‌ - లక్కింశెట్టి మహేష్‌

బెస్ట్‌ ఫైరర్స్‌ - వెంకట సాయి కృష్ణారెడ్డి, అసది శివ శంకర్‌ అలాగే ఈ కార్యక్రమంలో ఉత్తమ డ్రిల్‌ ఇన్స్‌స్ట్రకర్లకు కూడా ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేశారు.

Updated Date - Sep 26 , 2026 | 11:56 PM