‘సర్’ పారదర్శక అమలుకు కృషిచేయాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:13 AM
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూన 27 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా కృషి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మాధవీనగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, యువ నాయకుడు గౌరు జనార్దనరెడ్డితో కలిసి కల్లూరు అర్బన 16 వార్డుల టీడీపీ ఇనచార్జ్, క్లస్టర్ ఇనచార్జిలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు చేయాలన్నారు. సర్ ప్రక్రియ అమలు, ఓటరు జాబితా సవరణ, అర్హులైన ఓటర్ల నమోదు, నకిలీ ఓటర్ల తొలగింపు, ఓటర్ల జాబితా పరిశీలనలో టీడీపీ శ్రేణులు పారదర్శకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, బలోపేతానికి ప్రతి ఓటరు పాత్ర చాలా కీలకమన్నారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆమె పేర్కోన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.