Share News

చెంచు గిరిజనుల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:17 PM

చెంచు గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీడీఏ పీవో పీవీఎస్‌ నాయుడు అన్నారు.

చెంచు గిరిజనుల అభివృద్ధికి కృషి
చెంచు గిరిజనులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో పీవీఎస్‌ నాయుడు

ఐటీడీఏ పీవో పీవీఎస్‌ నాయుడు

శ్రీశైలం, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): చెంచు గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీడీఏ పీవో పీవీఎస్‌ నాయుడు అన్నారు. శుక్రవారం పెచ్చెరువులో పర్యటించిన ఆయన అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యాభ్యాసం చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పక్కా గృహాల నిర్మాణ సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్‌ సూచనల మేరకు ఓ మోడల్‌ హౌస్‌ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. గ్రామంలో 72 పక్కా ఇళ్ల ని ర్మాణానికి టైటిల్‌ డీడ్స్‌ మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్‌, అటవీ, వ్యవసాయ భూముల సాగు, వీబీజీ రామ్‌జీ పనుల్లో ఎదురయ్యే సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు వారికి హామీ ఇచ్చారు. చేపలు పట్టే ఇద్దరికి ఉపాధి అవకాశాలు పెంచుతూ సైకిళ్లు, ఐస్‌బాక్స్‌, చేపలు పట్టే వలలను అందజేశారు. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కేజీ నాయక్‌, ఏపీడీ, వెలుగు అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:17 PM