Share News

పకడ్బందీగా నులిపురుగుల నిర్మూలన

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:26 PM

జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ దేవసాగర్‌, రమేష్‌ అన్నారు.

 పకడ్బందీగా నులిపురుగుల నిర్మూలన
బాలికలతో మాట్లాడుతున్న డాక్టర్‌ దేవసాగర్‌

నేడు జిల్లావ్యాప్తంగా ఆల్‌బెండజోల్‌ మాత్రల పంపిణీ

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 24, (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ దేవసాగర్‌, రమేష్‌ అన్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్‌బెండజోల్‌ 400 మి.గ్రా చప్పరించి నమిలే మాత్రలను పంపిణీ చేయాలన్నారు. 1 - 5 సంవత్సరాల పిల్లలకు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ఎర్రగుంట్ల జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్ధులకు సూచనలు ఇచ్చారు. అనంతరం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,46,400 మంది పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శారదాబాయి, ప్రోగ్రామ్‌ అధికారి, డిప్యూటీ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ జగదీష్‌ చంద్రారెడ్డి, డాక్టర్‌ కాంతరావు నాయక్‌, రమేష్‌, సిబ్బంది రామగుర్రప్ప, వెంకటరమణ, మల్లికార్జున, వీరన్న పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:26 PM