Share News

ముగిసిన మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:38 AM

: ‘ఏబీఎన-ఆంధ్రజ్యోతి’, ఏడీ-6 అడ్వర్టైజ్‌ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో ‘విద్యాజ్యోతి‘ ఆదివారం మౌర్యఇన హోటల్‌లోని ఆర్య కన్వెన్షన హాలులో ఘనంగా ముగిసింది. మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో కార్యక్రమానికి కర్నూలు నగరంతో పాటు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు వందలాదిగా తరలిరావడంతో అపూర్వ స్పందన లభించింది.

 ముగిసిన మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో
మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పోకు హాజరైన విద్యార్థులు

‘ఏబీఎన-ఆంధ్రజ్యోతి’, ఏడీ-6 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ

విద్యర్థుల నుంచి ‘విద్యాజ్యోతి’కి మంచి స్పందన

కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘ఏబీఎన-ఆంధ్రజ్యోతి’, ఏడీ-6 అడ్వర్టైజ్‌ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో ‘విద్యాజ్యోతి‘ ఆదివారం మౌర్యఇన హోటల్‌లోని ఆర్య కన్వెన్షన హాలులో ఘనంగా ముగిసింది. మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో కార్యక్రమానికి కర్నూలు నగరంతో పాటు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు వందలాదిగా తరలిరావడంతో అపూర్వ స్పందన లభించింది. మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యాసంస్థల స్టాళ్ల వద్దకు వెళ్లి ఆయా నిర్వహకులతో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? కోర్సుల అనంతరం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఫీజుల వివరాలతో పాటు విద్యాసంస్థలో ఉన్న కనీస సౌకర్యాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు వంటి నగరాలకు వెళ్లకుండానే విద్యార్థుల ముంగిటకే రావడం అభినందనీయమని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల ప్రతినిధులతో తల్లిదండ్రుల ఇష్టాలను ప్రాధాన్యంతో పాటు విద్యార్థుల అభిరుచుల మేరకు కోర్సులను ఎంచుకునేలా మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. నగరంలోని వివిధ విద్యాసంస్థల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆర్య కన్వెన్షన హాలు సందడిగా మారింది. రిజిస్ర్టేషన చేసుకున్న విద్యార్థులకు ప్రతి గంటకు ఒకసారి లాటరీ లక్కీడ్రిప్‌ తీసి విజేతలైన విద్యార్థులకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. ఆంధ్రజ్యోతి కర్నూలు యూనిట్‌ బ్రాంచ మేనేజర్‌ లక్ష్మణ్‌, ఏడీ-6 సీఈవో భాస్కర్‌ రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు టీజీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య లక్కీడ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో మెగా ఎడ్యుకేషన ఎక్స్‌పో ఏర్పాటు చేయడం మొదటిసారి అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఏబీఎన-ఆంధ్రజ్యోతి, విద్యాజ్యోతి దిక్సూచిగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన ఇనచార్జి చల్లా నవీన కుమార్‌ చౌదరి, ఏబీఎన స్టాఫ్‌ రిపోర్టర్‌ పసుపుల సుంకన్న, సర్కులేషన మేనేజర్‌ సోమశేఖర్‌, యాడ్స్‌ మేనేజర్‌ గోపాల్‌,

హాజరైన విద్యాసంస్థలు

రేవా యూనివర్సిటీ

ప్రెసిడెన్సీ యూనివర్సిటీ

న్యూహరిజన కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌

సీఎంఆర్‌ యూనివర్సిటీ

ఆర్‌ఆర్‌ ఇనిస్టిట్యూషన్స

సంబ్రం ఇనిస్టిట్యూషన్స,

ఎంఎస్‌ రామయ్య ఫౌండేషన

హర్షా ఇనిస్టిట్యూషన్స,

కృపానిధి గ్రూఫ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స

కేంబ్రిడ్జి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

ఈస్ట్‌, వెస్ట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స

ఎస్‌ఈఏ గ్రూఫ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స

రామయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్స, కామర్స్‌ ఇనిస్టిట్యూషన్స

రామయ్య యూనివర్సిటీ ఆఫ్‌ అప్లయిడ్‌ సైన్స

ఎస్‌-వ్యాస డీమ్డ్‌ యూనివర్సిటీ, గార్డెన సిటీ యూనివర్సిటీ,

ఈస్ట్‌ పాయింట్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స

బృందావన గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స

ఆచార్య బెంగళూరు బీ-స్కూల్‌(అటానమస్‌)

మేనేజ్మెంట్‌ కోర్సులే మేలు

ఇంజనీరింగ్‌ కోర్సులకంటే బీసీఏ, గ్లోబల్‌ బీబీఏ, ఏవియేషన వంటి కోర్సులే మేలు. ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థల్లో బీటెక్‌ కోర్సులు చేయాలంటే రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే మేనేజ్మెంట్‌ కోర్సులకైతే రూ.10లక్షలలోపు పూర్తవుతుంది. రూ.40లక్షలు పెట్టుబడి ఇంజనీరింగ్‌ పూర్తి చేసి జీవితమంతా రాబట్టేందుకు జీవితకాలం సరిపోతుంది. అదే మేనేజ్మెంట్‌ కోర్సులు చేసి ఉద్యోగంలో చేరినట్లయితే విద్యకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు రెండు సంవత్సరాల్లోనే తిరిగి వస్తాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీల ఉద్యోగాలకు కోత పడుతుంది.. ఉద్యోగంలో చేరినప్పటికీ గ్యారెంటీ లేదు. మేనేజ్మెంట్‌ కోర్సులైతే మార్కెట్‌లో నిరంతరం డిమాండ్‌ ఉంటుంది. ఉద్యోగాలకు డోకా ఉండదు.

Updated Date - Mar 30 , 2026 | 12:38 AM