Share News

రైతులకు అవగాహన కల్పించండి

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:59 PM

ఏపీఏఐఎంఎస్‌ యాప్‌పై ప్రతి రైతుకు అవగాహన కల్పించి పంటల సాగుకు తగినంత డీఏపీ యూరియా మందులు వాడేలా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌ వెంకటేశ్వర్లు వ్యవసాయ సిబ్బందికి సూచించారు.

రైతులకు అవగాహన కల్పించండి
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌ వెంకటేశ్వర్లు

ఏిపీఏఐఎంఎస్‌ యాప్‌తో తగినంత యూరియా

జిల్లా వ్యవసాయాధికారి

కోవెలకుంట్ల, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ఏపీఏఐఎంఎస్‌ యాప్‌పై ప్రతి రైతుకు అవగాహన కల్పించి పంటల సాగుకు తగినంత డీఏపీ యూరియా మందులు వాడేలా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌ వెంకటేశ్వర్లు వ్యవసాయ సిబ్బందికి సూచించారు. గురువారం కోవెలకుంట్ల పట్టణంలోని వ్యవసాయ సహాయ సంచాలకులు సుధాకర్‌ అధ్యక్షతన కోవెలకుంట్ల సబ్‌ డివిజన్‌ పరిధిలోని దొర్నిపాడు, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ మండలాల్లోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి, డీలర్లకు రిప్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 ఖరీప్‌ నుంచి యూరియా, డీఏపీ ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ప్రతి రైతుకు వారు సాగు చేసిన పంటల ప్రకారం కేటాయిస్తారని తెలి పారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ గంగాధర్‌, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమణయ్య, ఆరు మండలాల వ్యవసాయాధికారులు, సాంకేతిక వ్యవసాయాధికారి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:00 AM