Share News

డ్వాక్రా సంఘాలు సీఎం మానస పుత్రికలు : మంత్రి బీసీ

ABN , Publish Date - May 03 , 2026 | 11:07 PM

డ్వాక్రా సంఘాలు సీఎం చంద్రబాబునాయుడుకు మానసపుత్రికలు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

డ్వాక్రా సంఘాలు సీఎం మానస పుత్రికలు : మంత్రి బీసీ
స్మార్ట్‌ ఫోన్‌లు అందజేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, మే 3 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాలు సీఎం చంద్రబాబునాయుడుకు మానసపుత్రికలు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం బనగానపల్లె పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్‌ ఫోన్‌లు మంత్రి బీసీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు, మహిళల సాధికారత, సాంకేతిక విని యోగం లక్ష్యంతో బనగానపల్లెలో గ్రామ సంఘాల సహాయకులకు అ త్యాధునిక 5జీ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. డ్వాక్రా సం ఘాల రికార్డులను డిజిటలైజ్‌ చేయడం, పొదుపు రుణాల వివరాలు ప్ర భుత్వ పథకాల సమాచారాన్ని వేగంగా సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఫోన్‌లు ప్రభుత్వం అందించిదన్నారు. తొలివిడతగా 178 మంది బుక్‌ కీపర్లకు సెల్‌ఫోన్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. త్వరలో మిగిలిన 53 మందికి పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:07 PM