క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:32 AM
ఈ-ఆటో డ్రైవర్లు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఈ-ఆటో డ్రైవర్లు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. గురువారం విశాల్ మార్ట్ సమీపంలోని ఈ-ఆటోల చార్జీంగ్ స్టేషన వద్ద ఈ-ఆటోల పార్కింగ్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ పాయింట్, చార్జింగ్ పాయింట్ల పనితీరును పరి శీలించారు. ఆయన మాట్లాడుతూ చెత్త సేకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ బాధ్యతగా విధులు నిర్వహించా లని సూచించారు. ఆటోల నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే ఏజెన్సీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. డీఈఈలు పవన కుమార్‌రెడ్డి, నరేష్, శానిటరీ సూపర్‌వైజర్ రమేష్ బాబు, శానిటరీ ఇనస్పెక్టర్ మునిస్వామి, వెహికల్ ఇనచార్జి మధుబాబు పాల్గొన్నారు.