గంగమ్మ ఒడికి దుర్గమ్మ
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:43 AM
కర్నూలు నగరంలో 9 రోజుల పాటు పూజలందుకున్న దుర్గమ్మ.. గంగమ్మ చెంత కు చేరింది.
ముగిసిన దసరా ఉత్సవాలు
తుంగభద్రలో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం
కర్నూలు కల్చరల్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో 9 రోజుల పాటు పూజలందుకున్న దుర్గమ్మ.. గంగమ్మ చెంత కు చేరింది. బుధవారం రాత్రి నగరంలోని సంకల్‌బాగ్‌లో తుంగభద్ర నదీతీరాన ఉన్న దుర్గాఘాట్‌లో అమ్మవారి విగ్రహాల నిమజ్జన వేడుకలు కోలాహలంగా ముగిశాయి. ఈ వేడుకలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశలు జ్యోతి ప్రజ్వలన, ‘రావణవధ’ చేసి ప్రారంభించారు. అనంతరం గంగాహారతి నిర్వహించి, అమ్మవారి తొలి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ తొలుత ఒకే విగ్రహంతో ప్రారంభమైన దుర్గామాత ఉత్సవాలు ప్రస్తుతం వందలాదిగా చేరుకున్నాయన్నారు. భక్తుల భాగస్వామ్యం, ప్రజల ఆదరణతో కర్నూలులో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఏటేటా మరింత వైభవాన్ని సంతరించుకుంటున్నాయన్నారు. గీతా ప్రచార సంఘం, విశ్వ హిందూ పరిషత, టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. టీజీ వెంకటేశ మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా 25 ఏళ్లుగా కొనసాగుతున్న దుర్గామాత నిమజ్జనోత్సవాలను నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీహెచపీ దక్షిణాంధ్రరాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థనరెడ్డి, టీడీపీ మేయర్ అభ్యర్థి విజయప్రత్యూష, పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో టీజీవీ కళాక్షేత్రం :
విజయవాడ తర్వాత అంతటి స్థాయిలో కర్నూలు నగరంలో జరిగే దసరా ఉత్సవాలకు వేలాదిమంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహ్మద్‌మియ ఆధ్వర్యంలో సభ్యులు, కళాకారులు తరలివచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కళాకారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకటు ్టకున్నాయి. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం సేవ లను మంత్రి టీజీ భరత అభినందించారు.