కరువు సహాయక చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:39 PM
జిల్లా వ్యాప్తంగా కరువు సహాయక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం కర్నూలు రూరల్ మండల కార్యదర్శి బత్తిన సురేంద్ర, కౌలురైతు సంఘం నాయకుడు రాముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు రూరల్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కరువు సహాయక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం కర్నూలు రూరల్ మండల కార్యదర్శి బత్తిన సురేంద్ర, కౌలురైతు సంఘం నాయకుడు రాముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురు వారం కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం సచివాలయం ఎదుట బీకెఎంయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బత్తిన సురేంద్ర, రాముడు పాల్గొని ప్రసంగించారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు బ్యాంకులో తీసు కున్న అప్పులు దాదాపు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి, ఒక్కక్కరికి రూ.50వేల చెల్లించాలని, ఉపాధి కూలీలకు రోజుకు కనీసం రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గార్గేయపురం సచివాలయంలో అధికారు లకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.