డ్రోన్ కెమెరాలతో నిఘా : ఎస్పీ
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:11 AM
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు ఎస్పీ సునీల్ షొరాన్ తెలిపారు.
చాగలమర్రి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు ఎస్పీ సునీల్ షొరాన్ తెలిపారు. గురువారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆర్‌వో సునిల్‌ఖన్నతో నామినేషన్‌ల నిర్వహణపై చర్చించారు. భద్రత ఏర్పాట్ల గురించి ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ పోలీసులతో చర్చించారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అవాంఛనీయ సంఘటనలు చేసుకుంటే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సోషల్‌మీడియా వేధికగా రెచ్చగొట్టే పోస్టులు, ప్రచారం చేసే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. తహసీల్దార్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో తాహిర్‌హుసేన్, పోలీసులు ఉన్నారు.