Share News

కీలకం కానున్న డ్రోన్‌ టెక్నాలజీ

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:32 PM

భవిష్యత్తులో డ్రోన్‌ టెక్నాలజీ కీలకం కానున్నదని ఉపకులపతి వి. వెంకట బసవరావు అన్నారు.

కీలకం కానున్న డ్రోన్‌ టెక్నాలజీ
సమావేశంలో మాట్లాడుతున్న ఉపకులపతి

ఆర్‌యూ ఉప కులపతి వి. వెంకటబసవరావు

క ర్నూలు, అర్బన్‌ మార్చి 27 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో డ్రోన్‌ టెక్నాలజీ కీలకం కానున్నదని ఉపకులపతి వి. వెంకట బసవరావు అన్నారు. శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీలో డ్రోన్‌ టెక్నాలజీపై 5 రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రోన్‌లు వైద్య, వ్యవసాయ, యుద్ధరంగంలో విరివిగా ఉపయోగిస్తారని తెలి పారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీని ప్రకటించడం మన అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిపు ల్‌ ఐటీ డీఎం ప్రొఫెసర్‌ కృష్ణ నాయక్‌, ప్రిన్సిపాల్‌ వెంకట సుందరానంద పుచ్చా, సీ. విశ్వనాథరెడ్డి, కోఆర్డినేటర్‌ బీఏ శరత్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:33 PM