Share News

డ్రైవర్లకు పదోన్నతి కల్పించాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:51 PM

ప్రభుత్వ వాహన డ్రైవర్లకు పదోన్నతులు కల్పించాలని ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు జీజీహెచ సూపరింటెం డెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు.

డ్రైవర్లకు పదోన్నతి కల్పించాలి
జీజీహెచ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇస్తున్న ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వాహన డ్రైవర్లకు పదోన్నతులు కల్పించాలని ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు జీజీహెచ సూపరింటెం డెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం ఆయన ప్రభుత్వ వాహన డ్రైవర్లతో కలిసి సూపరింటెండెంట్‌ను కలి శారు. నాలుగో తరగతి డ్రైవర్లకు పదోన్నతి ఇవ్వాలని, సర్వీసు రెగ్యులరైజేషన చేయాలని కోరారు. గత 6 నెలలుగా కార్యా లయంలో పదిసార్లు లెటర్లు పెట్టిన సంబంధిత క్లర్క్‌ సమస్యను పట్టించు కోవడం లేదని సూపరింటెండెంట్‌ దృష్టికి తెచ్చారు. సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అల్లీబాషా, జాయింట్‌ సెక్రటరీ రమేష్‌బాబు, సెక్రటరీ మనోహర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:51 PM