గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తరాదు
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:38 PM
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అఽధికారులదే అని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. అన్ని శాఖల అఽధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
నందికొట్కూరు రూరల్, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అఽధికారులదే అని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. అన్ని శాఖల అఽధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంగళవారం నందికొట్కూరు మండల అభివృద్ధి కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అథిథిగా హాజరైన ఎమ్మెల్యే జయసూర్య అన్ని రంగాల శాఖల అధికారులతో మూడునెలల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈని కొణిదేల గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడు దగ్గరుండీ మరీ పనులు చేయించాలని సూచించాఉ. ముందుగా బొళ్లవరం గొల్ల లక్ష్మిదేవికి రూ.20 వేలు, జంగంపాడు శివనాయక్‌కు రూ.37,179, కోళ్లభావాపురం దినేష్‌కు రూ.91,819, దామగట్ల బైరెడ్డి లలితమ్మకు రూ.2,13,916, వడ్డెమాను బోయ రంగస్వామికి రూ1,91,949ల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు.
బొళ్లవరంలోని రైతు సేవాకేంద్రంలో ఏడీఏ గిరీష్, తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏఓ షేక్‌షావళి సమక్షంలో గ్రామ రైతులకు ఎమ్మెల్యే జయసూర్య రాజముద్రతో కూడిన పట్టాదారు పొలం పాసు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రమణ్యశర్మ, టీడీపీ సీనియర్ నాయకులు మండ్ర సురేంద్రనాథరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాదరెడ్డి, మాజీ ఎంపీటీసీ తిప్పారెడ్డి పాల్గొన్నారు.