Share News

నీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:50 PM

మండలంలోని జ్ఞానాపురం గ్రామం ప్రాథమిక పాఠశాలలో నీటి కోసం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

నీటి కోసం విద్యార్థుల ఇక్కట్లు
నిరుపయోగంగా ఉన్న ట్యాంకు... నీరు రాని కొళాయి

పనిచేయని చేతి బోరు, నిరుపయోగంగా ట్యాంకు, కొళాయి

చాగలమర్రి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జ్ఞానాపురం గ్రామం ప్రాథమిక పాఠశాలలో నీటి కోసం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాల వద్దగల మంచినీటి కొళాయి, ట్యాంకుకు బోరు ఉన్నా పనిచేయడం లేదు. చేతి బోరు ఉన్నా నిరుపయోగంగా ఉంది. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 16 మంది చదువుతున్నారు. నీరు లేకపోవడంతో పాఠశాలలో మధ్యాహ్నం నిర్వహించే ఏజెన్సీ నిర్వాహకురాలు బిందెలతో నీరు తెస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:51 PM