Share News

మందుబాబుల ఆగడాలు

ABN , Publish Date - May 24 , 2026 | 12:25 AM

పాఠశాలలకు సెలవులు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండడం లేదు, దీన్ని గమనించిన ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.

మందుబాబుల ఆగడాలు
ధ్వంసమైన కిటికీల తలుపులు.. పాఠశాలలో మద్యం సీసాలు

కొలిమిగుండ్ల, మే 23 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు సెలవులు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉండడం లేదు, దీన్ని గమనించిన ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ ప్రాథమిక, జడ్పీ ఉన్నత, బీసీ పాఠశాల తరగతి గదుల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ఆవరణంలో మద్యం సేవించి పాఠశాల తలుపులు, కిటికీలను ధ్వంసం చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పోలీసులు మందుబాబులు, పోకిరీల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 24 , 2026 | 12:25 AM