Share News

ఎండిన పత్తి పంట

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:33 PM

రైతులకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో వేసిన పత్తి పంటలు ఎండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావం రైతులను భయపెడుతుంది.

ఎండిన పత్తి పంట
ఎండిపోయిన పత్తి పంట

నష్టపోయిన రైతు

ఓర్వకల్లు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో వేసిన పత్తి పంటలు ఎండిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభావం రైతులను భయపెడుతుంది. బోరు, బావుల్లో భూగర్బజలాలు ఇంకిపోయాయి. చినుకు జాడ లేకపోవడంతో బోరుబావుల నుంచి నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతోంది. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన రైతు తిరుపతయ్య ఐదెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. సాగుకు రూ.5లక్షలు పెట్టుబడి పెట్టారు. రెండు బోర్లు ఉండగా.. పత్తి పంటను సాగు చేసి వంద రోజులు కావస్తుంది. పంట ఏపుగా పెరిగినా భూగర్భజలాలు ఇంకిపోవడంతో పంట వాడుముఖం పట్టి ఆకులు రాలిపోయి మొక్కలు ఎండిపోతున్నాయి. పంటపై పెట్టుబడి రూ.5లక్షలు పెట్టానని, నష్టపోయానని రైతు తిరుపతయ్య వాపోయాడు.

Updated Date - Jul 14 , 2026 | 11:33 PM