పేదల సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:39 AM
పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా లబ్ధిదారులకు టిడ్కో గృహలను అందిస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహాల పంపిణీ లో మంత్రి పాల్గొని 95 మంది లభ్దిదారులకు గృహాల మంజూరు పత్రాలను, మెగా కీను అందజేశారు
రాష్ట్ర మంత్రి టీజీ భరత్
లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాల అందజేత
కర్నూలు అర్బన్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా లబ్ధిదారులకు టిడ్కో గృహలను అందిస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహాల పంపిణీ లో మంత్రి పాల్గొని 95 మంది లభ్దిదారులకు గృహాల మంజూరు పత్రాలను, మెగా కీను అందజేశారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఫిబ్రవరి నెలలో 500 మందికి టిడ్కో గృహాలను అందజేయనున్నట్లు తెలిపారు. విద్యుత్, తాగునీరు, బస్సు సౌకర్యం, పోలీసు భద్రత, మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. గృహాలుపొందిన లబ్దిదారులు నివాసం ప్రారంభించాలన్నారు. గత ప్రభుత్వం టిడ్కో గృహాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. టిడ్కో గృహాల సమీపంలోనే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్ ఉండటంతో ఈ ప్రాంత వాసులకు రానున్న రోజుల్లో విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ రమణ మూర్తి, టిడ్కో ఎస్‌ఈ శేషసాయి పాల్గొన్నారు.