నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
ABN , Publish Date - May 18 , 2026 | 12:12 AM
మండలంలోని బినిగేర, చిగిలి, తంగరడోన, కారుమంచి, కలపరి గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షానికి 27 విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్స్‌ఫార్మర్, రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి.
శనివారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలులతో నష్టం
పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం
ఇబ్బందులు పడిన ప్రజలు
ఆస్పరి, మే 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బినిగేర, చిగిలి, తంగరడోన, కారుమంచి, కలపరి గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షానికి 27 విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్స్‌ఫార్మర్, రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. బలంగా వీచిన ఈదురుగాలల బీభత్సం సృష్టించాయి. గాలుల తీవ్రతకు 27 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు చెట్లు కూలడం, వైర్లు తెగిపోవడం వల్ల రహదారులపై కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. విద్యుత్‌వాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు ప్రారంభించారు. విద్యుత్ ఏఈ ఆంజనేయశాస్త్రి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు. వాతావరణ సాధారణ స్థితికి వచ్చేవరకు జాగ్రత్తలు పాటించాలన్నారు.
అంధకారంలో గుళ్ల మొరుసు గ్రామం
గోనెగండ్ల: మండలంలోని గుళ్లమొరుసు గ్రామంలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో కూడిన వర్షం పడటంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో గ్రామం అంధకారంలో మగ్గిపోతుంది. విద్యుత్ అధికారులు గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. చీకటి పడితే మహిళ లు, చిన్న పిల్లలు, వృద్ధులు ఆరుబయటకు వచ్చేందుకు భయపడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను సరి చేయాలని కోరుతున్నారు.