Share News

బిల్లులు ఇవ్వరా?

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:31 PM

హౌసింగ్‌ బిల్లులు సంవత్సరమైనా మంజూరు చేయలేదని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన చెంచుకాలనీ మహిళలు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాల యం వద్ద ఆందోళన చేశారు.

బిల్లులు ఇవ్వరా?
ధర్నా చేస్తున్న చెంచు మహిళలు

హౌసింగ్‌ కార్యాలయం ఎదుట మహిళల ధర్నా

నంద్యాల కల్చరల్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): హౌసింగ్‌ బిల్లులు సంవత్సరమైనా మంజూరు చేయలేదని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన చెంచుకాలనీ మహిళలు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాల యం వద్ద ఆందోళన చేశారు. సాయంత్రం హౌసింగ్‌ పీడీ హరగోపాల్‌ రాకతో ఆందోళన సద్దు మణిగింది. పీయం జన్మన్‌ కింద ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల కోసం చెంచు మహిళలు గత సంవత్సరం 167 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 105 మందికి బిల్లులు మంజూరు అయ్యాయి. మిగతా 52 మందికి బిల్లులు మంజూరు కాలేదు. సంవ త్సరం దాటినా అధికారులు బిల్లులు మంజూరు చేయలేదు. దీం తో ఆందోళనకు దిగారు. కాగా సాఫ్ట్‌ వేర్‌ సమస్య వలన బిల్లులు రావ డం ఆలస్యమైందని హౌసింగ్‌ పీడీ హరగోపాల్‌ తెలిపారు.

Updated Date - Feb 04 , 2026 | 11:31 PM