మాస్ కాపీయింగ్‌కు తావివ్వద్దు
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:10 PM
పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులను డీఈవో జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.
డీఈవో జనార్దన్‌రెడ్డి
వెలుగోడు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులను డీఈవో జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం వెలుగోడులో పదో తరగతి పరీక్షా కేం ద్రాలను ఆయన తనిఖీ చేశారు. రెండు కేంద్రాల్లో తరగతి గదులను పరి శీలించారు. ఆత్మకూరు సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి సైతం పరీక్ష కేంద్రాల తనిఖీ చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈవో బ్రహ్మంనాయక్, ఎస్‌ఐ పాల్గొన్నారు.