ప్రిస్కిప్షన్ లేకుండా మాత్రలు అమ్మవద్దు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:15 AM
డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఎన్‌ఆర్‌ఎక్స్, నార్కోటిక్స్, యాంటీ బయాటిక్ మందులను అమ్మరాదని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.హరిహరతేజ హెచ్చరించారు.
కర్నూలు హాస్పిటల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా ఎన్‌ఆర్‌ఎక్స్, నార్కోటిక్స్, యాంటీ బయాటిక్ మందులను అమ్మరాదని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.హరిహరతేజ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం నగరంలోని కెమిస్ట్ భవన్‌లో జిల్లాలోని మెడికల్ షాపు యజమానులతో సదస్సు నిర్వహించారు. ప్రిస్కిప్షన్ మీద అమ్మాల్సిన మందులు మాత్రమే మెడికల్ షాపులో విక్రయించాలని షాపుల యజమా నులకు సూచించారు. అలాగే ఎన్‌ఆర్‌ఎక్స్, నార్కోటిక్స్ యాంటీ బయాటిక్స్‌కు సంబంధించిన హెచ్‌ఐ రిజిస్టర్‌ను తప్పక నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి. హనుమన్న, ఆదోని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జయరాముడు, కర్నూలు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పుల్లయ్య, శ్రీధర్, జిల్లా కోశాధికారి విజయకుమార్ పాల్గొన్నారు