Share News

ఫైళ్లను పెండింగ్‌లో పెట్టొద్దు

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:44 PM

విద్యాశాఖకు సం బంధించిన ఎలాంటి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరి ష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు.

ఫైళ్లను పెండింగ్‌లో పెట్టొద్దు
రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు

రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖకు సం బంధించిన ఎలాంటి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరి ష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో శుక్రవారం డీఈవో సుఽ దాకర్‌ అధ్యక్షతన ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉద్యో గులకు విద్యాశాఖ పరిపాలన, కోర్టు డిసిప్లనరీ కేసులు పరిపాలన, సర్వీసు రూల్స్‌పై ఒక్కరోజు వర్క్‌షాపు నిర్వహించారు. జేడీ మాట్లాడు తూ ఏ స్థాయిలోనూ ఫైళ్లను పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పై స్థాయి అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. విద్యాశాఖలో కోర్టు కేసులు, డిసిప్లనరీ కేసులు అధికంగా వస్తున్నాయని, అధికారుల సా ్థయిలో సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన సెలవులు, బెనిఫిట్స్‌ సంబంధించిన ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు తనిఖీలకు వెళ్లినప్పుడు సంబంధిత అధికారులు విధిగా నిబంధనలు పాటించాలని, రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలిం చాలని సూచించారు. అన్ని వసతులు ఉంటేనే కొత్తగా ప్రైవేటు పాఠశా లలకు అనుమతులు ఇవ్వాలన్నారు. ప్రైవేటు పాఠశాలల రెన్యువల్స్‌ కోసం వచ్చిన ఫైళ్లను విధిగా భవన సముదాయ సౌకర్యంతో పాటు అన్నీ ధ్రువీకరణ పత్రాలు పొందేలా పరిశీలించాలన్నారు. ఆ పాఠశాలల యజ మాన్యాలను, ఉపాధ్యాయులను వేధించకూడదన్నారు. కడప ఆర్జేడీ సామేల్‌, నంద్యాల డీఈవో జనార్దన్‌ రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ విజయ రాఘవ, డిప్యూటీ డీఈవోలు, ఏడీలు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 11:44 PM