రైతులతో రాజకీయం చేయరాదు
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:26 AM
రైతులతో రాజకీయాలు చేయవద్దని, పక్షపాతం లేకుండా రైతులందరికీ మేలు చేయడమే టీడీపీ ప్రభుత్వ ఽధ్యేయమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఎర్రకోట గ్రామంలో ఎంఎ్‌సపీ-1ఆర్ నుంచి సాగునీరు విడుదల చేశారు.
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు రూరల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రైతులతో రాజకీయాలు చేయవద్దని, పక్షపాతం లేకుండా రైతులందరికీ మేలు చేయడమే టీడీపీ ప్రభుత్వ ఽధ్యేయమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఎర్రకోట గ్రామంలో ఎంఎ్‌సపీ-1ఆర్ నుంచి సాగునీరు విడుదల చేశారు. ఎర్రకోట గ్రామంలో రాజకీయాలకతీతంగా రైతులందరికి సాగునీరు ఇవ్వడమే తమ ధ్యేయమన్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాలువకు రూ.9లక్షలతో మరమ్మతులు చేయించామన్నారు. గత పాలకులు కేవలం తమ భూములకు మాత్రమే సాగునీటిని వదులుకొని సామాన్య రైతులకు తీరని అన్యాయం చేశార న్నారు. తమ స్వార్థం కోసం ఎంతో మంది రైతులకు అన్యాయం చేశార ని.. తాము రైతులతో రాజకీయం చేయమని అందరి రైతులకు సమానంగా సాగునీటిని అందించి వారి క్షేమం కోసం మరిన్ని నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించి సాగునీరు అందించి పంటలు పండించుకునేలా చూస్తామన్నారు. సిరాలదొడ్డి చెరువు నుంచి సాగునీరందేలా ఏర్పాట్లు చూస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు చొరవ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులు ఉల్లిగడ్డలను గొర్రెలు, పశువులకు మేతగా వదిలేస్తే పట్టించుకున్న పాపానపోలేదని, ఇప్పుడు రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చైర్మన్ కురువ మల్లయ్య, నందవరం ఎంపీపీ ఖాసింవలి, ఎంఎ్‌సపీ-1ఆర్ వైస్ చైర్మన్ టమోటా ఉసేన్, డీసీ-7 వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణరెడ్డి, నరసింహులుగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దయ్య, కడిమెట్ల చంద్ర, భీమరాయుడు, ఎల్లెల్సీ డీఈ విద్యాసాగర్, ఏఈఈ మఠికంఠ, వర్క్‌ఇన్‌స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.