Share News

అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:25 PM

అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని టైగర్‌ ఫారెస్టు డిప్యూటీ డైరెక్టరు చైతన్యకుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రుద్రవరం ఫారెస్టు రేంజ్‌ను సందర్శించారు. బోరింగ్‌ బేస్‌ క్యాంపునను పరిశీలించి అటవీ సంరక్షణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు
పరిశీలిస్తున్న టైగర్‌ ఫారెస్టు డిప్యూటీ డైరెక్టరు

రుద్రవరం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని టైగర్‌ ఫారెస్టు డిప్యూటీ డైరెక్టరు చైతన్యకుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రుద్రవరం ఫారెస్టు రేంజ్‌ను సందర్శించారు. బోరింగ్‌ బేస్‌ క్యాంపునను పరిశీలించి అటవీ సంరక్షణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రుద్రవరంలోని ఫారెస్టు కార్యాల య ఆవరణంలో ఉన్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. వర్షాలు ఉరిస్తే ప్లాంటేషన్‌లను నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో రేంజర్‌ ముర్తుజావలి, డిప్యూటీ రేంజర్‌ శ్రీనివాసరెడ్డి, సెక్షన్‌ ఆఫీసర్లు మహబూబ్‌ఖాన్‌, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:25 PM